Friday, 20 December 2019

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌: చీఫ్ గెస్ట్ చిరంజీవి

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుక మెగా సూపర్ ఈవెంట్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి రావడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఇలాంటి సినిమా ప్రచార వేడుకల్లో ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మధ్య కాలంలో ఒక హీరో కోసం మరో హీరో రావడం ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ కోసం సీనియర్ హీరో అయిన చిరంజీవి వస్తుండటంతో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇదిలా ఉంటే, చిరంజీవి పట్ల మహేష్ బాబుకి ఎంతో గౌరవం ఉంది. ఆ మధ్య సినీమహోత్సవంలో చిరంజీవితో కలిసి పాల్గొన్న మహేష్ బాబు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి గారి పక్కన కూర్చోవడం అదృష్టమని అన్నారు. అంతేకాదు ఆయన హీరోగా నటించిన ‘సైరా’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. మరి తనను అంత గౌరవించే మహేష్ గురించి చిరంజీవి ఏం మాట్లాడతారు.. ఎలాంటి కొత్త విషయాలు చెబుతారు వంటి విషయాలు ఆసక్తికరంగా మారాయి. Also Read: కాగా, మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్‌ను ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తరవాత ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PGtsvV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...