Monday, 30 December 2019

న్యూ ఇయర్ పార్టీకి మంచి కిక్కిచ్చే తెలుగు పాటలు.. వెయ్యిరా మావ!!

తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగే అయినా.. చాలా మందికి ఇంగ్లిష్ న్యూ ఇయర్ అంటేనే ఎక్కువ మక్కువ. దానికి కారణం హడావుడి, హంగామా, ఎంజాయ్‌మెంట్. డిసెంబర్ 31 వస్తుందంటే చాలు చాలా మందిలో ఏదో తెలియని హంగామా మొదలైపోతుంది. ఆ రోజు రాత్రి ఏం చేయాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? ఎలాంటి డీజే పెట్టాలి? అనే కుర్రాళ్లంతా ఆలోచిస్తారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏ వీధిలో చూసినా మ్యూజిక్ మోత మోగాల్సిందే. ఎక్కడ చూసినా పార్టీ వాతావరణమే కనిపిస్తుంది. మరి ఇలాంటి పార్టీల్లో మంచి కిక్కిచ్చే పాటలు ఉంటేనే కదా ఊపొస్తుంది. సౌండ్ సిస్టమ్‌లో పాట వస్తే డ్యాన్సంటే ఏంటో తెలియని వారు కూడా కాలు కదపాలి. దిస్ ఈజ్ ద న్యూ ఇయర్ పార్టీ అంటూ కుప్పి గంతులు వేయాలి. అలా మనతో గంతులు, స్టెప్పులు వేయించే సినిమా పాటలు ఈ ఏడాది చాలానే వచ్చాయి. దేవీశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు అందించిన ఫాస్ట్ బీట్ సాంగ్స్‌తో పాటు మంచి పార్టీ సాంగ్స్ మీకోసం అందిస్తున్నాం. డాంగ్ డాంగ్ (సరిలేరు నీకెవ్వరు) దుమ్ము ధూళి (దర్బార్) దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రాములో రాములా (అల వైకుంఠపురములో) కోకా కోలా పెప్సీ (వెంకీ మామ) ఏక్ బార్ (వినయ విధేయ రామ) రౌడీ బేబీ (మారి 2) మరణం మాసు మరణం (పేట) గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ తకిట తకిట (ప్రతిరోజూ పండగే) గిర్రా గిర్రా (ఎఫ్2) బెస్ట్ మాస్ సాంగ్స్ టాప్ 15 తెలుగు డ్యాన్స్ సాంగ్స్ తెలుగు మాస్ సాంగ్స్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39spWx2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...