Saturday, 7 December 2019

సాహో ఎఫెక్ట్‌.. ప్రభాస్‌ కొత్త సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా?

బాహుబలి తరువాత ఇమేజే మారిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, తన నెక్ట్స్ సినిమాను కూడా అదే స్థాయిలో ప్లాన్‌ చేశాడు. బాహుబలి ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆయడిన్స్‌ను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ సినిమాకు నష్టాలు రావటంతో తదుపరి చిత్రాల విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సాహో రిలీజ్‌కు ముందే నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్‌. Also Read: జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమా ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ జరగనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. అందుకోసం ఇటలీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌ పాత్ర కోసం పెద్ద ఎత్తున వింటేజ్‌ కార్లను కూడా తీసుకువచ్చారు. అయితే సాహో రిజల్ట్‌ తరువాత నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కాకుండా కాస్త లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే సినిమా చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. Also Read: అయితే ప్రస్తుతం ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవల్‌లో మార్కెట్‌ ఉంది. ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన సాహో కూడా బాలీవుడ్‌లో బాగానే కలెక్ట్ చేసింది. అందుకే నెక్ట్స్ సినిమాను కూడా మరీ భారీగా కాకపోయినా దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఆస్ట్రాలజర్‌ పాత్రలో నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sWB0lx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...