Wednesday, 11 December 2019

లవర్స్‌ని పరిచయం చేస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఓ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్రవ‌రి 14న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నాడు. నాలుగు రోజుల్లో వరుసగా నాలుగు పోస్టర్లు వదలనున్నాడు. సినిమా ప్రచారంలో ఇదో కొత్త స్ట్రాటజీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. Also Read: ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ప్రక‌ట‌న‌ల‌ను చేయ‌బోతున్నారు. ఈ నాలుగు ప్రక‌ట‌న‌ల‌ను పైన పేర్కొన్న తేదీల్లో సాయంత్రం 6:03 గంటలకు చేస్తారు. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ‌య‌కృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36rz5Ut
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...