Friday, 20 December 2019

`ఫైటర్‌` కోసం ఇంటర్‌నేషనల్‌ స్టార్‌ని దింపుతున్న పూరి

ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన పూరి తిరిగి ఫుల్‌ ఫాంలోకి వచ్చాడు. చాలా రోజులుగా సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ కొత్త ఊపు ఇచ్చింది. అదే జోరులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేశాడు. అయితే ఈ సారి గతంలోలా సినిమాను చుట్టేయకుండా పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇస్మార్‌ శంకర్‌ తరువాత హీరోగా సినిమాను ఎనౌన్స్‌ చేశాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లోకి చేరాలి భావిస్తున్న పూరి, ఫైటర్‌ను అదే స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నాడు. Also Read: విజయ్‌ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌, శ్రీదేవి కూతురు భామ జాన్వీ కపూర్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయాలన్న ఉద్దేశంతో బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌తో ఇప్పటి నుంచే చర్చల జరుపుతున్నాడు. విజయ్‌ దేవరకొండకు నేషనల్‌ లెవల్‌లో క్రేజ్‌ ఉండటంతో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇంటర్‌ నేషనల్‌ స్టార్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట పూరి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో కీలక పాత్రలో చేయించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మైక్‌ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sNFI4K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...