Wednesday, 25 December 2019

‘‘డైరెక్టర్ ప్రేయసిని పటాయించాను.. ఛాన్స్ ఇప్పించేసింది’’

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. 20 ఏళ్ల వయసులో సల్మాన్ చాకొలెట్ బాయ్‌లా ఉండేవాడు. బహుశా అతని చూపుకు ఎందరో అమ్మాయిలు పడిపోయి ఉంటారు. అయితే ఓ ప్రకటనలో ఛాన్స్ కోసం ఏకంగా డైరెక్టర్ గర్ల్‌ఫ్రెండ్‌నే పటాయించేశాడట. ఈ విషయాన్ని సల్మానే ఓ సందర్భంలో వెల్లడించారు. ‘‘ఓసారి సీ రాక్ క్లబ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో ఓ అందమైన అమ్మాయిని చూశాను. ఎర్ర చీర కట్టుకుని చాలా సెక్సీగా ఉంది. ఆమెను పటాయించడానికి నీటి లోపలికి వెళ్లిపోయి స్విమ్మింగ్ చేసేవాడిని. అదే నేను చేసిన తప్పు. నేను నీళ్లలో నుంచి బయటికి వచ్చి చూడగానే ఆ అమ్మాయి కనిపించలేదు. ఆ మరుసటి రోజు నాకు ఫార్ ప్రొడక్షన్స్ అనే సంస్థ నుంచి పిలుపు వచ్చింది. నన్ను ఓ కూల్ డ్రింక్ కమర్షియల్ ప్రకటనలో తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే నేను యాక్ట్ చేసిన తొలి ప్రకటన. అయితే నాకు ఆ అవకాశం ఎలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తుండగా.. కైలాష్ అనే డైరెక్టర్‌ను కలవడానికి వెళ్లాను. నా నెంబర్ ఎవరు ఇచ్చారు అని అడిగాను. అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎరుపు రంగు చీర కట్టుకున్న అమ్మాయి ఎవరో కాదు తన గర్ల్‌ఫ్రెండేనని. నేను నీటి లోపలికి వెళ్లి ఈత కొట్టడం ఆ అమ్మాయి చూసిందట. వెంటనే కైలాష్‌కు ఫోన్ చేసి నేను బాగా ఈత కొడతానని చెప్పిందట. అప్పట్లో నేను, జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా మాత్రమే అలా అండర్ వాటర్ స్విమ్మింగ్ చేసేవాళ్లం. అలా నేను తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను’’ అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు సల్మాన్. READ ALSO: ఆయన నటించిన ‘దబాంగ్ 3’ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ కథానాయికలుగా నటించారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయని సినీ విశ్లేషకులు తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sYZzhM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...