Thursday, 12 December 2019

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి

తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి చిన్నతనం నుంచే కళారంగంవైపు అడుగులు వేశారు. కాలేజీ రోజుల్లోనే నవలలు, నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 290 సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు. టెలివిజన్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొల్లపూడి మృతితో ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కొల్పోయినట్లయ్యింది. ఈ ఆయన మృతి పట్ల యావత్‌ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు మృతికి సంతాపం తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ruYjTc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...