Friday, 20 December 2019

దేవుడా.. ఈ స్టార్ సెలబ్రిటీ అసలు స్నానం చేయడంలేదట

పైన కనిపిస్తున్న అమ్మాయి పేరు లేడీ గాగా. ఇంటర్నేషనల్ పాప్ సింగర్. ఈమె పాటలు కోట్ల రూపాయల్లో అమ్ముడుపోతుంటాయి. అయితే నిస్సిగ్గుగా తన గురించి విషయాన్ని చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆమె స్నానం చేసి కొన్ని నెలలు గడుస్తు్న్నాయట. ఇందుకు కారణం లేకపోలేదు. తన ఆరో ఆల్బమ్‌ను రూపొందించే పనిలో గాగా బిజీ అయిపోయారు. దాంతో ఉదయం లేవగానే స్టూడియోకి వెళ్లిపోతోందట. దాంతో తాను చివరిసారిగా ఎప్పుడు స్నానం చేసిందో కూడా గుర్తులేదట. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘నా అసిస్టెంట్ నన్ను ఓ ప్రశ్న అడిగాడు. నువ్వు చివరి సారిగా ఎప్పుడు స్నానం చేశావని. నాకు గుర్తు లేదు అని చెప్పాను’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఏకంగా లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. పైగా నెటిజన్స్ నుంచి వస్తున్న కామెంట్స్ మరీ విచిత్రంగా ఉన్నాయి. ‘నువ్వు స్నానం చేయకపోయినా ఫర్వాలేదు త్వరగా ఆ ఆల్బమ్‌ను విడుదల చేసేయ్’ అని కామెంట్లు పెడుతున్నారు. దీనిని బట్టే అర్థమవుతోంది లేడీ గాగా విడుదల చేయబోయే ఆల్బమ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో. స్నానం సంగతి అటుంచితే కనీసం పళ్లైనా తోముకుంటోందో లేదో. లేడీ గాగా నుంచి చివరి ఆల్బమ్ 2016లో వచ్చింది. అందుకే కాస్త లేటైనా లేటెస్ట్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించాలని తెగ కష్టపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EEsWbw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...