Saturday, 21 December 2019

దుమ్ములేపుతున్న `డిస్కో రాజా` రెండో పాట

టాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ బ్యానర్‌పై రజనీ తళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ లిరికల్‌ వీడియోలను విడుదల చేస్తున్నారు. ముందుగా `నువ్‌ నాతో ఏమన్నావో` అంటూ సాగే మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు. వింటేజ్‌ ఫీల్‌తో రూపొందించిన ఈ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని మరో పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఢిల్లీ వాలా అంటూ సాగే రెండు పాటను శుక్రవారం రిలీజ్ చేశారు. Also Read: తమన్‌ సంగీతమందించిన ఈ పాటను ఆదిత్య ఐయ్యంగార్‌, గీతా మాధురి, రాహుల్‌ నంబియార్‌లు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించాడు. సినిమాల రవితేజ క్యారెక్టర్‌కు సంబంధించిన నేపథ్యాన్ని తెలియజేస్తూ రూపొందించిన ఈ పాట సంగీతం, సాహిత్యం అందరినీ ఆకట్టకునేలా ఉన్నాయి. దీంతో పాట ఇన్స్‌స్టాంట్‌గా హిట్ అయిపోయింది. Also Read: ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ఈ పాట ఇప్పటి వరకు 1.5 మిలియన్‌ (15 లక్షల) వ్యూస్‌ సాధించింది. రవితేజ సరసన నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ECvU0n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...