Tuesday, 3 December 2019

‘ఆడపిల్ల దుస్తులు విప్పించారు, మేం అలాంటివాళ్లం కాదు’

బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కమాండో 3’. నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయితే ఈ సినిమాను ప్రముఖ రెజ్లర్ సుషిల్ కుమార్ వీక్షించారట. సినిమా తనను ఆగ్రహానికి గురిచేసిందని అన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఓ రెజ్లర్‌ను ఆడపిల్లలను హింసించే వ్యక్తిగా చూపించారట. ఓ మైనర్ బాలికను ఏడిపిస్తూ అందరూ చూస్తుండగానే ఆమె స్కర్ట్ పైకి లేపుతున్నట్లు చూపించారట. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చి అతని నుంచి బాలికను కాపాడినట్లు చూపించారు. ఈ విషయంపై సుషిల్ మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈ సన్నివేశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెజ్లర్లకు సమాజంలో మంచి పేరు, గౌరవం ఉన్నాయి. రెజ్లర్లను సినిమాలో తప్పుగా చూపించినందుకు కమాండో టీం మాకు సారీ చెప్పాలి. అంతేకాదు ఆ సన్నివేశాన్ని తొలగించాలి. సినిమాలో ఆ సన్నివేశం పెట్టే ముందు రెజ్లర్లపై సినిమా టీం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. మేం చాలా డీసెంట్‌గా, డిసిప్లైన్డ్‌గా ఉంటాం. ఈ విషయంపై ప్రేక్షకులు కూడా అభ్యంతరం తెలిపాలని అనుకుంటున్నాను’ అంటూ మండిపడ్డారు. ‘కమాండో 3’ సినిమాను ఆదిత్య దత్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రముఖ నటి అదా శర్మ కథానాయికగా నటించారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందనే చెప్పాలి. సుషిల్ కుమార్ 2012లో లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను సాధించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన ఏకైక భారతీయుడిగా సుషిల్ తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P9jeTj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...