Monday, 9 December 2019

‘ఫ్యాన్స్ మీదకు వచ్చేశారు.. దుస్తులన్నీ జారిపోయాయి’

ఇష్టమైన నటీనటులు కనపడితే చాలు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలంటూ ఫ్యాన్స్ మీదపడిపోతుంటారు. సెలబ్రిటీలు బాడీగార్డ్స్ లేకుండా బయటికి వెళితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అభిమానం వారిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ ఫ్యాన్స్ వల్ల షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓసారి ఈవెంట్‌ కోసమని రాయ్‌పూర్ వెళ్లాను. అక్కడ ఫ్యాన్స్ నన్ను చూడగానే చుట్టుముట్టేశారు. నా చుట్టూ బాడీగార్డ్స్ కూడా లేరు. ఫ్యాన్స్ మీదకు వచ్చేసరికి నా ఒంటి మీద దుస్తులన్నీ ఒక్కొక్కటికీ జారిపోయాయి. దాంతో వాళ్లే అడ్డుగా నిలబడి నా మానాన్ని కాపాడారు. ఆ సంఘటనతో నేను కొన్ని రోజులు షాక్‌లో ఉండిపోయాను’ అన్నారు. శ్వేతా తివారీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆమె టీవీ రంగాన్ని ఏలుతున్నారు. ‘కసౌటీ జిందగీ కే’ అనే సీరియల్‌తో శ్వేతాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్నా పర్సనల్ లైఫ్ వల్ల తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో ఓ కూతుర్ని కన్నారు. ఆ తర్వాత అతనితో గొడవలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతనితో ఓ కొడుకుని కన్నారు. కానీ అతను శ్వేత కూతురిపై చేయి చేసుకుని హింసిస్తున్నాడని కేసు పెట్టింది. దాంతో ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RCV0UC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...