పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయిపోయిన జనసేనాని.. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ‘పింక్’ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు. అలాగే, క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే పవర్ స్టార్ ఫ్యామిలీ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగను అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తన పిల్లలతో కలిసి జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి అత్తారింటికి వెళ్లారు. అంటే, తన భార్య అన్నాలెజ్నేవా స్వదేశమైన రష్యా వెళ్లారు. పవన్ కళ్యాణ్, లెజ్నేవా కలిసి ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వెళ్తోన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని పవన్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ కొంతమంది పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తు్న్నారు. జగన్‌ను విమర్శించే పవన్ ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కానీ, పవన్ అభిమానులు మాత్రం పవన్‌కు కుల మత బేధాలు లేవని వాదిస్తున్నారు. అన్నా క్రిస్టియన్ కాబట్టి ఆమె మతాన్ని గౌరవించి ఆమెతో పాటు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి రష్యా వెళ్లారని అంటున్నారు. ఏదేమైనా పవన్ అత్తారింటి టూర్ హాట్ టాపిక్‌గా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QiqgFV
v
No comments:
Post a Comment