Tuesday, 10 December 2019

పుకార్ల నేపథ్యంలో రానా సినిమా.. `కృష్ణ And His లీల`

ఆరోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నడు. ఇప్పటికే పెండింగ్‌ ఉన్న హాథీ మేరీ సాథీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రానా ప్రస్తుతం వెంకీ ప్రమోషన్‌ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాడు. వరుసగా చిత్రయూనిట్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ మీడియాలో సందడి చేస్తున్నాడు. త్వరలో తాను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం హిరణ్య కశ్యప పనులు ప్రారంభిచే ఆలోచనలో ఉన్నాడు రానా. ఈ సినిమాతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం షూటింగ్‌ కూడా ప్రారంభించాల్సి ఉంది. ఇలా నటుడిగా బిజీగా ఉంటునే నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు రానా. Also Read: ఇప్పటికే కేరాఫ్ కంచరపాలెం లాంటి డిఫరెంట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి తానెంటో నిరూపించుకున్న రానా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేశాడు. అడవి శేష్‌ హీరోగా క్షణం లాంటి ఇంట్రస్టింగ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన రవికాంత్‌ పెరెపు దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించనున్నాడు. కృష్ణ And His లీల అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రానా సమర్పణలో సురేష్ ప్రొక్షన్స్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, సంజయ్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిజమైన పుకార్త ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు చిత్రయూనిట్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. Also Read: లడక్‌లో చిత్రీకరించనున్న ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వడ్నికట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PLP09B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...