బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటి దీపాన్నిత శర్మ. ఇటీవల సంజయ్ తాను నటించిన ‘పానిపట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోకి వెళ్లారు. ఆ షోలో కమెడియన్ కపిల్ శర్మ.. సంజయ్ దత్‌కు ఓ ప్రశ్న వేశారు. ‘మీ 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?’ అని అడిగారు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ.. ‘నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో ఇంకా లెక్కపెట్టలేదు. కృతి సనన్‌ను నా 308వ గర్ల్‌ఫ్రెండ్ చేసుకోవాలని అనుకుంటున్నా’ అని చమత్కరించారు. దాంతో కపిల్ శర్మతో పాటు అక్కడున్న ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుకున్నారు. ఈ విషయంపై దీపాన్నిత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాట ఓ అమ్మాయి చెప్పి ఉంటే ఇలాగే నవ్వి ఊరుకునేవారా? అని ప్రశ్నించారు. ‘తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఓ షోకి వెళ్లిన ఓ నటుడు.. తనకున్న 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని మాటలు విని కపిల్ శర్మతో పాటు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుకున్నారు. ఒకవేళ అదే షోలో ఓ అమ్మాయి ఈ మాట అంటే ఇలాగే సరదాగా నవ్వి ఊరుకునేవారా? దాన్ని కూడా జోక్‌గా తీసుకునేవారా? ఈ అసమానత్వమే అన్ని తప్పులకు కారణం’ అని ట్వీట్ చేశారు. దాంతో చాలా మంది నెటిజన్స్ దీపాన్నితకు సపోర్ట్ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. సంజయ్ దత్ జీవితాధారంగా ‘సంజు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రీల్ లైఫ్ సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. ఈ సినిమాలో సంజయ్ దత్ 300 మందికి పైగా అమ్మాయిలతో డేటింగ్ చేశాడనే ఓ డైలాగ్ ఉంది. సినిమా మొత్తంలో ఈ డైలాగే చాలా వైరల్ అయింది. తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించుకుని సంజయ్ తన పరువు తానే తీసుకున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DVWocQ
v
No comments:
Post a Comment