సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతోనే కాకుండా వెంకటేష్, నాగార్జున, బాలయ్య, చిరంజీవి లాంటి సీరియర్ హీరోలతోనూ ఆడిపాడింది . అందం, అభినయం అన్నీ ఉన్నా.. స్టార్ హీరోయిన్ అనే రేంజ్‌ను ఎక్కువకాలం నిలుపుకోలేక పోవడంతో శ్రియ.. చేతి నుండి మెల్లమెల్లగా సినిమా జారిపోయాయి. దీంతో ఏ సినిమా వస్తే ఆ సినిమానే అన్నట్టుగా ఆఖరుకి వడివేలు లాంటి కమెడియన్స్‌తో కూడా రొమాన్స్‌కి రెడీ అనేసింది. కాగా ఒకప్పటి స్టార్ దర్శకుడు వినాయక్ లేటు వయసులో డెబ్యూ హీరో కాబోతున్న విషయం తెలిసిందే. శీనయ్యగా ఇటీవల ఓ మాస్ లుక్‌ని కూడా వదలిపెట్టి హీరో అయిపోవడానికి సీరియస్‌గా కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ ముదురు వయసు డెబ్యూ హీరో సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రియ తలుపుతట్టిందట. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రానికి దర్శకత్వం వహించారు . ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రియ నటించింది. ఠాగూర్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా శ్రియకు మంచి మైల్ స్టోన్ మూవీ అయ్యింది. తన కెరియర్‌లోనే బెస్ట్ హిట్ ఇవ్వడమే కాకుండా మెగాస్టార్ సరసన అవకాశం ఇచ్చిన వివి వినాయక్‌తో జోడీ కట్టేందుకు రెడీ అయిపోయిందట శ్రియ. శీనయ్య చిత్రంలో శ్రియను హీరోయిన్‌గా తీసుకున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రానికి ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మిస్తున్నారు. ‘దిల్’ చిత్రంతో దిల్ రాజుకి లైఫ్ ఇచ్చిన వీవీ వినాయక్‌ను 15 ఏళ్ల తరువాత హీరోని చేస్తున్నారు దిల్ రాజు. ఈ చిత్రాన్ని మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35sEWbt
v
No comments:
Post a Comment