బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ప్రస్తుతం ఆయన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న ‘చిన్నారి పెళ్లికూతురు’ హీరో సిద్ధార్థ్ శుక్లాపై సల్మాన్ మండిపడ్డారు. సిద్ధార్థ్‌కు కోపం ఎక్కువ. దాంతో హౌజ్‌లో ఉన్నవారిపై అరవడం, వారిపై చేయి చేసుకోవడం, అసహ్యంగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడు. దాంతో సల్మాన్ సిద్ధార్థ్ ప్రవర్తను ఖండిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. ‘అసలు ఏం అనుకుంటున్నావ్ నువ్వు? ఆ ప్రవర్తనేంటి? ఇంకోసారి హౌజ్‌లో ఇదే విధంగా ప్రవర్తించావంటే ఊరుకోను. నిన్ను ఈ హౌజ్ నుంచి గెంటేస్తాను. నువ్వు బయటికి వెళ్లినా కూడా ఇండస్ట్రీలో నీకు పని లేకుండా చేస్తాను. ఈ షో నుంచి నేను ఎవర్నైనా ఎలిమినేట్ చేయాలనుకుంటే అది కచ్చితంగా నువ్వు అవుతావ్. హౌజ్‌లో నీ ప్రవర్తన వల్ల బాధపడ్డ వారందరికీ నేను న్యాయం చేస్తాను’ అని వెల్లడించారు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఇప్పుడు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో అంత ఆసక్తికరంగా లేదు. ఎప్పుడైతే సిద్ధార్థ్ శుక్లా ఇతర కంటెస్టెంట్లతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి టీఆర్‌పీ రేటింగ్స్ దూసుకెళుతున్నాయి. అందుకే సిద్ధార్థ్ దురుసుగా ప్రవర్తిస్తున్నా కూడా అతన్ని కాకుండా ఇతర కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నాడు సల్మాన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XDKrl7
v
No comments:
Post a Comment