Tuesday, 19 November 2019

Rakul Preet Singh: నన్ను మోసం చేశాడు, అది చాలా పెద్ద కథ

హార్ట్‌ బ్రేక్స్ సాధారణ మనుషులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. వారు కూడా తలుచుకుని ఎంతో కుమిలిపోతుంటారు. నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఇలాంటి స్టోరీ ఉందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ వ్యక్తి తనను మోసం చేసినట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరు చెప్పలేదు కానీ ‘నీకు టేస్ట్ లేదు’ అని చెప్పేసి అతనికి గుడ్‌బై చెప్పేశారట. ‘అవును నేను మోసపోయాను. కానీ బాధపడటం ఎందుకు? నీకు అసలు టేస్టే లేదు అని చెప్పి గుడ్‌బై చెప్పేశా’ అని తెలిపారు. ఇంకా చాలా ప్రశ్నలకు రకుల్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’ సినిమాలో నటించాల్సి ఉందట. కానీ అప్పటికే ఆమె బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ సినిమాకు ఒప్పుకోవడంతో డేట్లు కుదరక ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందట. ‘నాకు గీత గోవిందంలో నటించే అవకావం వచ్చింది. కానీ నేను అప్పటికే దే దే ప్యార్ దే సినిమాతో బిజీగా ఉన్నాను. డేట్లు ఖాళీ చేసుకుందామన్నా కూడా కుదరలేదు. దాంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అయితే సినిమాను వదులుకున్నందుకు బాధ లేదు కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కనీసం అందులో ఓ చిన్న క్యారెక్టర్ చేసినా బాగుండేది అనిపించింది’ అని తెలిపారు. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు పైరసీకి గురైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో విజయ్, రష్మిక కెమిస్ట్రీ క్రేజీగా ఉందంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఇండస్ట్రీలో తనతో కలిసి నటించిన ఓ హీరో సెక్స్ కావాలని కూడా అడిగాడట. అయితే క్యాస్టింగ్ కౌచ్‌లా అసభ్యకరంగా కాకుండా మర్యాదపూర్వకంగానే అడిగాడట. ‘నన్ను ఓ కో స్టార్ అడిగాడు కానీ అసభ్యకరంగా కాదు. ఫ్రెండ్లీగానే అడిగాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని నో చెప్పేశాను’ అని వెల్లడించారు రకుల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KDOhp8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...