Thursday, 21 November 2019

‘Rajinikanth పేరు చెప్పి నన్ను రెచ్చగొట్టకండి’

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, నిర్మాత టి. రాజేందర్ మీడియా ముందుకు వచ్చారంటే సంచనల కామెంట్లు చేస్తుంటారు. తన కామెంట్లతో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌లపై నోరుపారేసుకున్నారు. వివరాల్లోకెళితే.. ఎన్‌ఎస్‌సీ డిస్ట్రిబ్యూటర్స్ ఎసోసియేషన్‌‌‌లో సెక్రటరీ స్థానం కోసం రాజేందర్ పోటీ చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఓ విలేకరి.. రజినీకాంత్, కమల్ హాసన్‌లాగా రాజకీయాల్లోనూ పోటీ చేస్తారా అని అడిగారు. ఇందుకు రాజేందర్ స్పందిస్తూ.. ‘రజినీకాంత్, కమల్ హాసన్‌లాగా నేను పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వలేదని నా చేత చెప్పించాలనుకుంటున్నారా? నన్ను రెచ్చగొట్టి టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? నాపేరు టీఆర్. నేనెప్పుడూ టీఆర్‌పీలల్లో టాప్‌లో ఉంటాను. నేను సీఎం అయిపోవడానికి ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉండి తప్పులు చేస్తున్నవారిని ప్రశ్నించడానికి వచ్చాను. నేను రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వీరాభిమానిని. ఇండస్ట్రీలో వారు నాకంటే సీనియర్లు. వారి రాజకీయ నిర్ణయాల గురించి నన్ను ప్రశ్నించకండి’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రముఖ నటుడు శింబు తండ్రి అయిన రాజేందర్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారేం కాదు. గతంలో నటి ధన్సికను స్టేజ్‌పైనే అందరి ముందు అవమానించాడు. ‘నేను హన్సికకు ధన్సికకు భయపడను. ఎందుకంటే గతంలో హన్సిక నా కొడుకుతో డేటింగ్ చేసింది’ అంటూ ఆమె పరువుతీసేశాడు. దాంతో రాజేందర్‌ను ఇండస్ట్రీ నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OsqN7q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...