Monday, 4 November 2019

పూజాతో బోనీ మీటింగ్‌: Pawan Kalyan కోసమా.. అజిత్‌ కోసమా..?

ప్రస్తుతం టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు . సమంత పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు వెళ్లిపోవటం, రకుల్ ప్రీత్ వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉండటంతో పాటు కాజల్‌, తమన్నా, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్‌ ఫేడ్ అవుట్ అవుతుండటంతో దర్శక నిర్మాతలు పూజా వైపే చేస్తున్నారు. అందుకే ఈ భామ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాతో పాటు ప్రభాస్‌, రాధకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో, ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. తాజాగా ఈ భామ మరో నిర్మాతతో చర్చలు జరుపుతోంది. Also Read: ఇటీవల పింక్‌ రీమేక్‌తో సౌత్‌తో అడుగుపెట్టిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌. హీరోగా నేర్కొండ పార్వై సినిమాను తెరకెక్కించిన బోనీ సౌత్‌లో మరిన్ని చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అజిత్ హీరోగా మరో సినిమాను ప్రారంభించిన బోని కపూర్‌, రీ ఎంట్రీ సినిమాను దిల్‌ రాజుతో కలిసి నిర్మించనున్నాడు. Also Read: తాజాగా ఈ స్టార్‌ ప్రొడ్యూసర్‌ను క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే కలవటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన సౌత్‌ ప్రాజెక్ట్స్‌ చర్చల్లో భాగంగానే బోనీ కపూర్‌ పూజాను కలిశారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే పూజను ఏ సినిమా కోసం తీసుకోనున్నారన్న చర్చ జరుగుతోంది. Also Read: అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కోసమా.. లేక పవన్‌ తెరకెక్కించనున్న పింక్‌ రీమేక్‌ కోసమా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన పూజా పింక్‌ రీమేక్‌లో నటిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ మీటింగ్‌ వెనకున్న అసలు విషయం తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JO7Zhe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...