Thursday, 7 November 2019

Mukesh Ambani డబ్బులిస్తా నా సమస్య తీర్చు: రాఖీ సావంత్

బాలీవుడ్ ఐటెం గర్ల్ మాటల్ని, ఆరోపణల్ని ఎవ్వరూ పట్టించుకోరు. కాకపోతే కాసేపు చదువుకోవడానికి, నవ్వుకోవడానికి కాస్త టైంపాస్ అవుతాయంతే. ఇతర సెలబ్రిటీలపై నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ, వారిపై పడి ఏడ్చే రాఖీ సావంత్ ఇప్పుడు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీని టార్గెట్ చేసింది. అంబానీ ప్రారంభించిన జియో సర్వీసులపై కామెంట్ చేసింది. జియో సిమ్ కార్డులకు బాగానే హైప్ వచ్చినా రాను రాను నెట్‌వర్క్ సమస్యలు తలెత్తాయి. సిమ్ కార్డ్‌తో పాటు కాల్స్, మెసేజెస్, నెట్ ఉచితంగా ఇష్తానని అంబానీ జనాలను ఊరించారు. దాంతో అంతా ఎగబడి జియో సిమ్ కార్డులు తీసుకున్నారు. నెమ్మదిగా జియోకు నెట్‌వర్క్ సమస్యలు వచ్చాయి. దీని గురించి కామెంట్ చేస్తూ రాఖీ సావంత్ టిక్ టాక్ వీడియో చేసింది. ‘అంబానీ.. కావలంటే 50, 60 రూపాయలు ఎక్కువ ఇస్తాను. సరైన నెట్‌వర్క్ ఇచ్చి మా సమస్యలను పరిష్కరించు’ అని కామెంట్ చేసింది. ఫ్రస్టేషన్‌లో రాఖీ వీడియోలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే పడి పడి నవ్వుకుంటారు. ఇకపోతే ఇటీవల ఈ వివాదాస్పద నటి యూకేకి చెందిన ఎన్నారైను పెళ్లి చేసుకుంది. అయితే అతని పేరు రితేష్ అని వెల్లడించింది కానీ ముఖం మాత్రం చూపించలేదు. ప్రస్తుతం తన భర్తతో కలిసి యూకేలోనే ఉంటోంది. మరో విషయం ఏంటంటే.. ఇటీవల యూకేలోని తన ఇంటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అది ఇల్లు కాదు హోటల్ రూం అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. తాను రాఖీ సావంత్‌ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని రితేష్ ఇటీవల మీడియా ముందు వెల్లడించాడు. తన విషయంలో రాఖీని టార్గెట్ చేస్తున్నవారికి సమాధానం చెప్పడానికి ఏదో ఒక రోజు మీడియా ముందుకు వస్తానన్నాడు. రాఖీ సినిమాల్లో ఎలాంటి వేషాలు వేసినా వాటిలో నిజాయతీ ఉందని రితేష్ తన భార్యను వెనకేసుకొచ్చాడు. రాఖీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ ధైర్యవంతుడెవరో చూసేందుకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WSDg8n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...