Friday, 8 November 2019

Kangana అక్రమ సంబంధంపై స్పందించిన యువ హీరో

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొన్నేళ్ల క్రితం చేసిన ఆరోపణలతో బాలీవుడ్ దద్దరిల్లింది. హృతిక్ రోషన్ తనను ప్రేమించి వాడుకుని వదిలేశాడని, సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ తనను కొట్టి హింసించాడని నోటికొచ్చిన కామెంట్లు చేశారు. దాంతో దాదాపు ఏడాది పాటు బాలీవుడ్‌లో ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తాజాగా ఈ ఎఫైర్‌పై ఆదిత్య పంచోలీ కొడుకు స్పందించారు. ‘ఈ విషయం గురించి నేనే ఏమీ మాట్లాడలేను. అది మా అమ్మానాన్నల సమస్య. వారు పరిష్కరించుకున్నారని అనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం అమ్మమ్మ తాతయ్యలతోనే గడిపాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. మా అమ్మానాన్నల జీవితంలో జరిగిన కొన్ని విషయాలపై నేను సంతోషంగా లేను. మా అమ్మ మానసికంగా చాలా స్ట్రాంగ్’ అని వెల్లడించారు. కంగన తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆదిత్య కేసు పెట్టారు. ఆదిత్య భార్య జరీనా వాహబ్ ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘కంగనకు నా భర్తతో అక్రమ సంబంధం ఉంది. పెళ్లైన ఒక మగాడితో సంబంధం పెట్టుకుని ఆ తర్వాత అతనితో విడిపోయి ఇప్పుడు రేప్ చేశాడంటే ఎలా?’ అని షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఆదిత్య తనపై కేసు వేయడంతో కంగన కూడా కేసు పెట్టారు. ఇప్పటికీ ఈ కేసుల కోర్టులో నానుతూనే ఉన్నాయి. పంచోలీ కుటుంబం మొత్తం దాదాపు ఆరేళ్లుగా వివాదంలో ఇరుక్కుంది. కంగన విషయంలో ఆదిత్య పేరు బయటికి వచ్చింది. బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పేరు బయటికి వచ్చింది. ఇప్పటికీ వీరిద్దరూ తమ కేసుల్లో భాగంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కంగన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆదిత్యతో చట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసున్నప్పటి ఫొటోలు కూడా ఇప్పటికీ వికిపీడియాలో కనిపిస్తున్నాయి. వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉందని ఆదిత్య సతీమణి జరీనా వాహబ్ ఆరోపించారు. అందుకే ఆదిత్య జీవితం నుంచి తప్పుకున్నారు. కంగన ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాక ఆదిత్యతో విడిపోయారట. ఆ తర్వాత ఆదిత్య తన భార్య వద్దకే వెళ్లిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36IJlbP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...