విలక్షణ నటుడు మళ్లీ ప్రేమలో పడ్డారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటి వరకు కమల్ ముగ్గురు హీరోయిన్లను డేటింగ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి పూజా కుమార్. కమల్, పూజ జంటగా ‘విశ్వరూపం’ సినిమాలో నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు గతేడాదిగా కమల్ హాసన్ ఏ ముఖ్య కార్యక్రమాలకు వెళ్లినా పూజా కుమార్ ఆయనకు తోడుగా వెళుతూనే ఉంది. తాజాగా బయటికి వచ్చిన వీరిద్దరి ఫొటో చూస్తే ఆ రూమర్స్ నిజమేనేమో అనక మానరు. ఇటీవల కమల్ తన 65వ బర్త్‌డే జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పరమకూడిలో కమల్ హాసన్ తన కుటుంబీకులను కలిశారు. వారంతా కలిసి ఫ్యామిలీ ఫొటో దిగారు. ఈ ఫొటోలో పూజా కుమార్ కూడా ఉండటం గమనార్హం. అయితే పూజ కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కమల్ హాసన్ ఎక్కడికి వెళ్లినా పూజ అక్కడికి వెళుతోందని మరికొందరి వాదన. ఒకవేళ ఈ మాటే నిజమైతే.. సినిమాల విషయంలో కమల్ హాసన్‌ను కలవాలి కానీ.. ఇలా ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా వెళ్లడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై పూజ కానీ కమల్ హాసన్ కానీ స్పందించలేదు. 1978లో కమల్ హాసన్ వాణి గణపతి అనే నటిని పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. పదేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నటి సారికను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రుతి హాసన్, అక్షర హాసన్. ఆ తర్వాత సారికతోనూ కమల్ బంధం తెచ్చుకున్నారు. కొన్నాళ్ల అనంతరం నటి గౌతమితో డేటింగ్ చేశారు. ఏమైందో ఏమో కానీ ఆమెతోనూ కమల్‌కు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంటో ఇటీవల కాలంలో వీరిద్దరూ తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు పూజా కుమార్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటు వయసులో ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఉండటం ఎంత వరకు కరెక్టో కమల్ హాసన్‌కే తెలియాలి. ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్‌కు ఇలాంటి ఎఫైర్ ఉందని తెలిస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు. మరి ఈ రూమర్స్ ఎంత వరకు నిజమో వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ClRZ1Y
v
No comments:
Post a Comment