Sunday, 24 November 2019

Gopichand హీరోయిన్: అమ్మాయిలకూ లిప్ కిస్ ఇస్తా, నాకేం అభ్యంతరం లేదు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘వీర్’ సినిమాలో నటించి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది . చూడటానికి అచ్చం బార్బీ డాల్ కత్రినా కైఫ్‌లా ఉందని సల్మాన్ ఈమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ కత్రినా సాధించిన సక్సెస్‌లో సగం కూడా సాధించలేకపోయింది జరీన్. ఏదో ఒకటిలే అనుకుంటూ వచ్చిన పాత్రలు చేసుకుంటూపోతోంది. సెక్సువల్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లోనూ నటించింది. ఇటీవల విడుదలైన ‘చాణక్య’ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా జరీన్.. సేమ్ సెక్స్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడంలో తప్పు లేదని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఇదే కాన్సె్ప్ట్‌తో సినిమాలు ఎందుకు తీయకూడదు అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి సినిమాలు తీయకపోతే స్వలింగ సంపర్కులకు సమాజం ఎలా సపోర్ట్ చేస్తుందని అంటోంది. ‘ఇక హీరోల పక్కన గ్లామర్ బొమ్మలా నిలబడే పాత్రలు చేయడం నా వల్ల కాదు. అంతకుమించి నాలో ట్యాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ సినిమాలో నాకు నచ్చిన పాత్రలే దొరికింది. స్వలింగ సంపర్కులైన అమ్మాయి, అబ్బాయిల పెళ్లి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇదివరకు నేను కేవలం బోల్డ్ సన్నివేశాలకు మాత్రమే పనికొస్తానని అనుకునేవారు. మున్ముందు నాకు మంచి పాత్రలు రాకపోవా అని అలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటించేదాన్ని. కానీ నాకు వేరే ఛాన్సెస్ రాలేదు. అప్పుడే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాలో ఉన్న మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టాలనుకుంటున్నాను’ ‘ స్వలింగ సంపర్కులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. సాధారణ మనుషుల్లా వారు సమాజంలో జీవించలేకపోతున్నారు. ఇక సెక్సువల్ సన్నివేశాల విషయానికొస్తే అవసరమైతే అమ్మాయిలకు కూడా లిప్ కిస్సెస్ ఇస్తా. నాకేం అభ్యంతరం లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం అలాంటి సన్నివేశాల ఏమీ లేవు’ అని వెల్లడించారు. జరీన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 2020 న్యూఇయర్‌కు ఆడియన్స్ ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Dc7rhB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...