Wednesday, 6 November 2019

అసురన్‌ రీమేక్‌కు ఆ దర్శకుడా..? రిస్కేమో వెంకీ!

కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను రామ్‌ చరణ్‌ హీరోగా రీమేక్‌ చేస్తారని భావించినా.. సీనియర్ హీరో రీమేక్‌ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తమిళ నిర్మాత కలైపులి ఎస్‌ థానుతో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్‌లో బిజీగా ఉన్న వెంకటేష్ ఈ సినిమా పూర్తయిన వెంటనే అసురన్‌ రీమేక్‌ పనులు ప్రారంభించనున్నాడు. ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేసేందుకు ఓ ఫ్లాప్‌ దర్శకుడిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. Also Read: రాజుగారి గది సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు ఓంకార్‌. అయితే ఆ తరువాత అదే సిరీస్‌లో తెరకెక్కిన రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. బుల్లితెర నుంచి సినీ దర్శకుడిగా ఎదిగిన ప్రస్తుతం ఓ టెలివిజన్‌ షో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడికే అసురన్‌ రీమేక్‌ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. Also Read: జీనియస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్‌ తొలి సినిమాతో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రెండు సినిమాతో ఆకట్టుకున్నా తరువాత మరో హిట్‌ దక్కలేదు. ఇప్పుడు అలాంటి దర్శకుడికి ఓ కల్డ్‌ క్లాసిక్‌ రీమేక్‌ బాధ్యతలు అప్పగించటం రిస్క్‌ ఏమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినా అసురన్‌ రీమేక్‌కు ఓంకార్‌ దర్శకుడన్న వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది. మరి ఈ సూపర్‌ హిట్ రీమేక్‌తో అయినా ఓంకార్‌ మరో హిట్ అందుకుంటాడామో చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CjfKYy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...