Wednesday, 20 November 2019

హీరోగారూ అది ఎంత పెద్ద బూతు మాటో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. అది బూతు పదం అని తెలిసినా కూడా ఆ పదం లేకపోతే క్యాప్షనే లేనట్లు అదే పదాన్ని వాడారు. ఇంతటీ మ్యాటర్ ఏంటంటే.. అభయ్ డియోల్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను ‘అదుర్స్’ సినిమాలో విలన్‌గా నటించిన మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్‌లో మహేష్, అభయ్ డియోల్ కుర్చీలో హాయిగా నిద్రపోతున్నప్పుడు ఎవరో ఫొటో తీశారు. ఈ ఫొటోను మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనికి పెట్టిన క్యాప్షన్ చదివి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ‘మొత్తానికి నేను సాధించాను. నా డైరెక్టర్‌తో పడుకున్నాను’ అని పేర్కొన్నారు. ఆయన ఇంగ్లీష్‌లో పెట్టిన ఒరిజినల్ క్యాప్షన్ ఏంటంటే... ‘i slept with my director’. ఇంగ్లీష్‌లో ఆ పదం వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. నిజానికి అభయ్ పెట్టిన ట్వీట్‌కి అసలైన అర్థం ‘నేను డైరెక్టర్‌తో సెక్స్ చేశాను’ అని. ఈ పదానికి రెండు అర్థాలు ఉండడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా అభయ్ పెట్టిన పోస్ట్‌పై స్పందించారు. కొందరు నెటిజన్లైతే దారుణంగా కామెంట్స్ చేశారు. ‘అంటే నువ్వు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నావా? ఏం మాట్లాడుతున్నావ్ ఆ డైరెక్టర్‌తో పడుకున్నావా?’ అంటూ వల్గర్ కామెంట్స్ పెట్టారు. మరికొందరైతే క్యాప్షన్ పెట్టే ముందు కాస్త ఆలోచించాలని, అది ఎంత పెద్ద తప్పు మాటో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది. కొందరికి అభయ్ పెట్టిన ఈ క్యాప్షన్‌ను సింగిల్ మీనింగ్‌తోనే అర్థం చేసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైపోతోంది కదా.. అందుకే నెగిటివ్‌గా ఆలోచించేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2s4W0Gf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...