Wednesday, 6 November 2019

వైరలైన ‘సెక్స్’ డైలాగ్.. తలపట్టుకున్న దర్శకుడు

సినిమాలు ప్రజలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ సినిమానే నిదర్శనం. ప్రముఖ బాలీవుడ్ యువ కథానాయకుడు నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. ముదస్సర్ అజీజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో భూమి పెడ్నేకర్ కార్తిక్ భార్య పాత్రలో అనన్య పాండే ప్రేయసి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో కార్తిక్ సెక్స్ గురించి వివరిస్తూ చెప్పే భారీ డైలాగ్ ఒకటి ఉంది. ‘భార్య దగ్గరకు వెళ్లి సెక్స్ అడిగితే బెగ్గర్ అంటారు. సెక్స్ చేయకపోతే నేరం అంటారు. నేనే ఏదోలా నా భార్యను మాటల్లో పెట్టి సెక్స్ చేద్దామంటే రేపిస్ట్ అంటారు’ అని ఇప్పటివరకు వాట్సాప్‌లో బాగా వైరల్ అయిన డైలాగ్‌ను ఇందులో వాడారు. భార్య అంగీకారం లేకుండా సెక్స్ చేయడం కూడా రేపేనని, అలాంటి డైలాగ్‌ని జోక్‌గా ఎలా మారుస్తారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ సినిమాను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా ఇలాంటి జోక్ వేయడం సబబు కాదని, వారిద్దరూ దీనిని ఖండించాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో నెటిజన్ల నుంచి విముఖత వస్తుండడంతో సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ తలలు పట్టుకుని కూర్చున్నారు. సినిమాకు ఎక్కడ కలెక్షన్లు రావోనని భయపడి ఈ డైలాగ్‌ను కట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. అయితే ఈ డైలాగ్‌ను వాడినందుకు నటి భూమి పెడ్నేకర్ క్షమాపణ చెప్పారు. ‘మేం మీ మనోభావాలను దెబ్బతీశామనిపిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలన్నది మా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో భాగమైన ఏ ఒక్కరూ సెక్స్ గురించి జోకులు వేసే రకం కాదు. అసలు ఆ ఆలోచనలు కూడా మాకు లేవు. మా దర్శకుడు అజీజ్ ఎప్పుడూ మహిళలను గౌరవిస్తారు’ అని తెలిపారు. 1978లో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32l7JNf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...