డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా బిజీ అయ్యే పనిలో ఉన్నాడు. ఇన్నాళ్లు తాను దర్శకత్వం వహించిన సినిమాలను మాత్రమే నిర్మించిన పూరి ఇప్పుడు కొడుకు సినిమాను వేరే దర్శకుడితో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా పూరి, చార్మిలు కలిసి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ పూరి, కేతిక శర్మలు జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ముందుగా ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని తీసుకున్నారు. ఇటీవల సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఉత్తరాది నటి మందిరా బేడీని రొమాంటిక్ సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేశారు. 47 ఏళ్ల వయసులోనే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో ఆకట్టుకునే ఈ భామ రొమాంటిక్ సినిమా కోసం కొద్ది రోజులు షూటింగ్ కూడా చేశారు. Also Read: అయితే మందిర ఆ పాత్రకు పూరి అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోవటంతో ఆమెను తొలగించినట్టుగా తెలుస్తోంది. మందిర బేడిని అనుకున్న పాత్రలోనే తరువాత నటిస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు మందిర కన్నా రమ్యకృష్ణ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. Also Read: ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ తొలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. తరువాత తనయుడ్ని రీలాంచ్ చేసే బాధ్యత తీసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఫెయిల్ అయ్యాడు. మెహబూబా సినిమాతో ఆకాష్ పూరిని రీలాంచ్ చేసే ప్రయత్నం చేసిన పూరి మెప్పించ లేకపోయాడు. దీంతో తాను నిర్మాతగా మారి తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WVgFYO
v
No comments:
Post a Comment