Friday, 29 November 2019

క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయి.. ప్రియాంక రెడ్డి హత్యపై అనుష్క

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక అభాగ్యురాలిపై నలుగురు కామ పిశాచులు లైంగిక దాడిచేసి అత్యంత క్రూరంగా హత్య చేయడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని, ధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ ప్రియాంక రెడ్డి హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. నటి అనుష్క శెట్టి అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్యచేసిన ఆ క్రిమినల్స్ చూసి క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవత్వాన్ని కదిలించే విషాదకరమైన ఘటన. ఈ క్రిమినల్స్‌ను క్రూర మృగాలతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి. మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం నేరమా. ప్రియాంక మరణానికి కారకులైన వారికి వెంటనే శిక్షపడే విధంగా మనమందరం పోరాటం చేద్దాం. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో అనుష్క పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంక రెడ్డిని రేప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి 28 కి.మీ. దూరంలోని షాద్‌నగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ వద్ద కిరోసిన్ పోసి ప్రియాంకను దహనం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R1Gmpx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...