Tuesday, 26 November 2019

హిందూపురంలో బాలకృష్ణ కోటి దీపోత్సవం.. హాజరైన అల్లుళ్లు

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆఖరి కార్తీక సోమవారం పురస్కరించుకుని అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణతోపాటు ఆయన భార్య వసుంధరాదేవి, పెద్దల్లుడు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, చిన్న అల్లుడు భరత్‌ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ దీపోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. ఈ కోటి దీపోత్సవానికి హిందూపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంజీఎం గ్రౌండ్ శివనామ స్మరణతో మార్మోగిపోయింది. కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటిని ఎవరూ మరువవద్దు, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని అన్నారు. అలాగే, హిందూపురంలో సామూహిక కోటి దీపోత్సవాన్ని నిర్వహించినట్టు ఫేస్‌బుక్ ద్వారా కూడా బాలకృష్ణ వెల్లడించారు. కుటుంబ సభ్యులతో పూజలు చేసిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. Also Read: ‘‘పవిత్రమైన కార్తీక మాసం శుభసందర్బంగా, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరికి ఉండాలని ప్రజాశ్రేయస్సు కోరుతూ.. మన సంసృతి సంప్రదాయలను గౌరవిస్తూ.. హిందూపురం నందు నా కుటుంబసభ్యులతో కలిసి నేను నిర్వహించిన ‘‘సామూహిక కోటి దీపోత్సవం’’ కార్యక్రమంలో వేలాదిగా హాజరైన మహిళలకు, భక్తాదులకు, హిందూపురం నియోజకవర్గ ప్రజానీకానికి, నా అభిమానులకు, సహకరించిన పోలీస్ అధికారులకు, పాత్రికేయులకు, మీడియా సోదరులకు పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పరమేశ్వరుని కృపతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. సదా మీ సేవలో నందమూరి బాలకృష్ణ’’ అని ఫేస్‌బుక్ పోస్టులో బాలయ్య పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DiPGND
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...