Friday, 22 November 2019

వచ్చే ఏడాది పిల్లల్ని కందామా.. భార్యకు ప్రేమతో స్టార్ సింగర్ మెసేజ్

పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇండియాలోనూ బీబర్ ఫ్యాన్స్ కోకొల్లలు. చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని తన ట్యాలెంట్‌తో మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. గతేడాది జస్టిన్ తన ప్రేయసి హెయిలీ బాల్డ్‌విన్‌ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ననే హెయిలీ తన 23వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా బీబర్ తన ప్రియమైన భార్య కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘బేబీ హ్యాపీ బర్త్‌డే. రోజూ నన్ను నేను మెరుగుపరుచుకునేలా చేస్తున్నావ్. నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్న తీరు నన్ను చాలా ఆకట్టుకుంటోంది. నువ్వు ఎలా ఉన్నా కూడా నన్ను నీ అందంతో టెంప్ట్ చేస్తుంటావ్. వచ్చే ఏడాది మనం పిల్లల్ని కందాం’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కి కొద్దిసేపట్లోనే నలభై లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018 సెప్టెంబర్‌లో బీబర్, హెయిలీ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బీబర్ లవ్ స్టోరీ గురించి మీకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. కొన్నేళ్ల క్రితం బీబర్‌కు హెయిలీకి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత బీబర్.. ప్రముఖ సింగర్ సెలీనా గోమేజ్‌తో డేటింగ్ చేశారు. ఈ జంటకు ఫ్యాన్స్‌లో చాలా క్రేజ్ ఉంది. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘జెలీనా’ అని పిలుచుకునేవాళ్లు. అందరూ వీరు పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారు. కానీ ఏమైందో తెలీదు కానీ విడిపోయారు. ఆ తర్వాత బీబర్.. మళ్లీ తన మాజీ ప్రేయసి హెయిలీ వద్దకే వెళ్లిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకుని అమ్మాయిల హృదయాలను బద్దలుకొట్టాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KISkjS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...