Tuesday, 19 November 2019

పవన్, రజినీలకు సవాల్ విసిరిన సూపర్ స్టార్ కృష్ణ

దిగ్గజ నటుడు, సూపర్ స్టార్‌గా కీర్తి గడించిన ఘట్టమనేని కృష్ణ.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, విక్టరీ వెంకటేష్‌లకు ఒక సవాల్ విసిరారు. ఇదేదో సినిమాకు సంబంధించిన సవాల్ అనుకునేరు! మొక్కలు నాటే సవాల్. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సినిమా ఇండస్ట్రీకి వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో చాలా మంది సినిమా, టీవీ నటులు భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కృష్ణ తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు. నటుడు కాదంబరి కిరణ్, ఎంపీ సంతోష్ కుమార్ దగ్గరుండి కృష్ణతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ.. హీరోలు పవన్ కళ్యాణ్, రజినీకాంత్, వెంకటేష్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. అలాగే, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను కృష్ణ అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కృష్ణ పిలుపునిచ్చారు. కాగా, తాను ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి ప్రాచుర్యం కల్పిస్తున్నారు ఎంపీ సంతోష్. తానే స్వయంగా రంగంలోకి దిగి సెలబ్రిటీలతో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మొక్కలు నాటిన ప్రముఖ టీవీ యాంకర్ సుమ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్‌కు సవాల్ విసిరారు. వీళ్లలో రాహుల్ ఇప్పటికే మొక్కలు నాటాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xt7WNs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...