Monday, 25 November 2019

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో టాలీవుడ్‌ హీరోకు జరిమానా

ఇటీవల సినీ, టెలివిజన్‌ సెలబ్రిటీలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు ఈ కేసులో పట్టుబడి జరిమానాలు చెల్లించగా తాజాగా మరో టాలీవుడ్‌ హీరోకు కూడా కోర్టు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో జరిమానా విధించింది. తెలుగు ఈ నెల 24న మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాచుపల్లిలో వీఎంఆర్ కాలేజ్ దగ్గర పట్టుబడ్డ ప్రిన్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ రోజు (మంగళవారం) కూకట్‌పల్లి కోర్టుకు హాజరయ్యాడు ప్రిన్స్‌. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రిన్స్‌కు జరిమానా విధించింది. జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు. Also Read: తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాడు డాష్ డాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్‌ సెసిల్‌. తరువాత బస్‌ స్టాప్‌, రొమాన్స్‌ సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా ఆ ఫాంను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ అయ్యి నేను శైలజ, మిస్టర్‌ లాంట సినిమాల్లో నటించాడు. నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో కంటెస్టంట్‌గానూ కనిపించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సిక్స్‌ పాక్‌ తో హల్‌ చల్‌ చేస్తున్నాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37wv822
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...