Sunday, 3 November 2019

శ్రీకాంత్ నా డూప్.. కొత్త విషయం చెప్పిన నాగార్జున

తెలుగు సినీ ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు కింగ్ నాగార్జున కొత్త విషయం చెప్పారు. శ్రీకాంత్ హీరో కాకముందు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారన్న విషయం తెలిసిందే. కానీ, ఆయన డూప్‌గా కూడా నటించారు. అది కూడా నాగార్జునకు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ‘హలో బ్రదర్’ సినిమాలో శ్రీకాంత్ డూప్‌గా నటించారట. నాగార్జునను వెనక నుంచి చూపించే షాట్లలో నటించింది శ్రీకాంత్ అట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా చెప్పారు. అది కూడా బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే వేదికపై. 100 రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 3 ముగియనున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ మాలో ప్రసారమైంది. ఈ ఫినాలేలో శ్రీకాంత్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానించిన నాగార్జున.. ‘‘ఎన్ని రోజులైంది కలిసి. మనం చాలా సినిమాల్లో చేశాం కదా’’ అని అన్నారు. దీనికి శ్రీకాంత్.. ‘‘నాలుగు సినిమాలు’’ అని సమాధానం ఇచ్చారు. వెంటనే ఓ చిన్న నవ్వు నవ్విన నాగార్జున.. ‘‘నాలుగు కాదు ఐదు. హలో బ్రదర్‌లో నా డూప్‌గా చేశాడు’’ అని చెప్పుకొచ్చారు. ఆ తరవాత శ్రీకాంత్‌ను బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు నాగార్జున. ఆయన చేతికి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చారు. ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును తీసుకొని ఒకరు ఇంట్లో నుంచి బయటికి వచ్చేయొచ్చని నాగార్జున మన టీవీ ద్వారా కంటెస్టెంట్లకు ఆఫర్ ఇచ్చారు. కానీ, ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ తరవాత స్టోర్ రూంలో ఉన్న మరో బ్రీఫ్ కేసును వరుణ్‌తో తెప్పించారు శ్రీకాంత్. అందులోనూ 10 లక్షల రూపాయలు ఉన్నాయి. మొత్తం 20 లక్షల రూపాయలు తీసుకొని ఒక్కరు బయటికి రావచ్చని నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయినా ఒక్కరూ ముందుకు రాలేదు. ఇక ఫైనల్‌గా ఎలిమినేషన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేశారు. దీని కోసం కేథరిన్‌ను హౌస్‌లోకి పంపారు. కేథరిన్ చేతిలో కవర్ ఉంది. ఆ కవర్‌ను శ్రీకాంత్ చేతికి ఇచ్చారు కేథరిన్. ఆ కవర్‌ను ఓపెన్ చేసి ఎలిమినేట్ అయిన రెండో వ్యక్తి ఎవరో కెమెరాకు చూపించారు శ్రీకాంత్. అందులో వరుణ్ పేరు ఉంది. అయితే పేరు చెప్పకుండా ఎలిమినేట్ అయిన వ్యక్తిని తీసుకొని బయటికి వచ్చేయండంటూ శ్రీకాంత్‌కు చెప్పారు నాగార్జున. వరుణ్ భుజంపై చేయివేసుకుని బయటికి తీసుకొచ్చేశారు శ్రీకాంత్, కేథరిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WDeDvZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...