Tuesday, 19 November 2019

పరాయి వ్యక్తులతో సెక్స్ అస్సలు తప్పు కాదు: డైరెక్టర్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ఔట్ ఆఫ్ లవ్’. అక్రమ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ ఇది. దీని గురించి ధులియా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం తప్పు కాదని అంటున్నారు. ‘అక్రమ సంబంధాలు ఈరోజుల్లో కామనే. ఇది మానవ సహజం. కానీ కొందరు వ్యక్తులు కట్టుకున్న వారిని మోసం చేయలేక పరాయి వారితో సంబంధాలు పెట్టుకోరు. మరికొందరు ఈ విషయంలో చాలా వీక్‌గా ఉంటారు. అందుకే కట్టుకున్న భార్యను, భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో సెక్స్ చేస్తుంటారు. నేను ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్ సిరీస్‌ను ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాను. నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్ట్స్‌లో ఇది చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. నేను స్క్రిప్ట్ అంతా చదివాను కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను నేనొక్కడినే డైరెక్ట్ చేశాను. ప్రేమ, అబద్ధాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో రసికా దుగ్గల్, పురబ్ కోహ్లీ, సోనీ రాజ్దాన్, హర్ష్ ఛాయా కీలక పాత్రల్లో నటించారు. వీరంతా చాలా సహజంగా నటించారు. భవిష్యత్తు అంతా వెబ్ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన కంటెంట్‌తో ఇండియా ఎన్నో వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అని వెల్లడించారు. ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. నవంబర్ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా ఎప్పుడో ఆమోదం తెలిపింది. భార్యభర్తల మధ్య వైవాహిక అనుబంధం లేనప్పుడు వారు మరొకరితో తమ జీవితాన్ని గడపాలని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పు లేదని తెలిపింది. పరస్పరం మాట్లాడుకుని విడాకులు తీసుకుని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అందుకే ఈ వెబ్ సిరీస్‌ కాన్సెప్ట్‌ని ఎలాంటి అభ్యంతరం లేకుండా తెరకెక్కించగలిగారు ధులియా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35f8g5l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...