Thursday, 21 November 2019

బరువు పెరగడంపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన ఇలియానా

గోవా బ్యూటీ లాంటి నడుము, ఫిగర్ ఉండాలని కోరుకోని అమ్మాయి ఉండదు. ఒకప్పుడు సన్నగా, అందంగా అమ్మాయిని పొగడాలంటే ఇలియానానే ఉదాహరణగా తీసుకునేవారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఇలియానా బాగా లావైపోయారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా శరీరంలో వచ్చిన మార్పులు చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అయితే తాను ఉన్నట్టుండి వెయిట్ పెరగడానికి కారణమేంటో ఇలియానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలియానా ఒకప్పుడు డిప్రెషన్‌తో చాలా బాధపడేవారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు మీడియా ముందు బయటపెట్టారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉన్న తన ఫిగర్‌ను చూసి ఎవరైనా కామెంట్ చేస్తారేమోనని చాలా బాధపడేదాన్నని తెలిపారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా రోజుకు పన్నెండు ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయేవారట. అందువల్ల తన శరీరంలో మార్పులు వచ్చి బరువు పెరిగిపోయానని తెలిపారు. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని పేర్కొన్నారు. ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారని బాధపడ్డారు. ఇప్పుడు మళ్లీ సన్నజాజిలా మారిపోయారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు మళ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బీచ్‌లో బికినీల్లో తన అందాలను ఆరబోస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో విడిపోయాక ఇలియానా తన పూర్తి ఫోకస్‌నను సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం ఆమె ‘పాగల్ పంతి’ అనే సినిమాలో నటించారు. త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. తెలుగులోనూ ఆమె త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37xqwcf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...