Tuesday, 26 November 2019

నిర్మాతగా మారుతున్న స్టార్‌ హీరోయిన్‌.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తుందట!

హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమంత త్వరలో కొత్త అవతారం ఎత్తబోతుందట. ప్రస్తుతం 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాతో శర్వానంద్‌కు జోడిగా నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో నిర్మాణ సంస్థను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌తో పాటు మనం ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా సమంత కూడా తన సొంత బ్యానర్‌ను స్థాపిస్తే ఆ ఫ్యామిలీ నుంచి మూడో నిర్మాణ సంస్థ అవుతుంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తరువాత సమంతలో చాలా మార్పు వచ్చింది. అప్పటి వరకు కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేసిన సమంత పెళ్లి తరువాత రూట్‌ మార్చింది. ఫార్ములా సినిమాలను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్‌ సినిమాల వైపు అడుగులు వేస్తోంది. యూ టర్న్‌, ఓ బేబీ లాంటి సినిమాలో మంచి విజయాలు సాధించింది. Also Read: నిర్మాతగానూ తన మార్క్‌చూపించాలని భావిస్తుందట సమంత. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేందుకే సమంత ఈ నిర్ణయం తీసుకుంది. తన సొంత బ్యానర్‌లో కొత్త దర్శకులతో సినిమాలను నిర్మించనుంది సామ్‌. అయితే బ్యానర్‌ను ఎప్పుడు స్థాపించనుంది. తొలి సినిమా ఎవరు డైరెక్ట్ చేయనున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒకే సినిమాలో నటిస్తోంది సమంత. ఈ సినిమాతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించేందుకు రెడీ అవుతోంది. నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టేందుకే ఇతర చిత్రాలు అంగీకరించటం లేదన్న టాక్‌ వినిపిస్తుంది. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Dgjfzp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...