Thursday, 7 November 2019

వెనక్కి తగ్గిన బన్నీ, మహేష్.. సంక్రాంతి ఫైట్‌ లేనట్టే!

టాలీవుడ్ సినిమాకు సంక్రాంతి సీజన్‌ చాలా ఇంపార్టెంట్‌. స్టార్ హీరోలు కూడా ఈ సీజన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. 2020లో కూడా సంక్రాంతి సీజన్‌కు గట్టి పోటి ఉంటుందన్న టాక్‌ వినిపించింది. సూపర్‌ స్టార్ , స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌లు సంక్రాంతి బరిలో తలపడేందుకు కాలు దువుతున్నారు. అయితే ఇద్దరు బిగ్ స్టార్స్‌ ఒకేసారి బరిలో దిగటంపై ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టుగా రెండు చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్‌లు ఎనౌన్స్‌ చేసిన దగ్గరనుంచి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ క్లాష్ హాట్ టాపిక్‌గా మారింది. ఒకే రోజు ఇద్దరు బిగ్ స్టార్స్‌ బరిలో దిగితే థియేటర్ల సమస్య తలెత్తటంతో పాటు కలెక్షన్ల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని భావించారు. Also Read: ఇదే విషయంపై ఇన్నాళ్లుగా చర్చలు జరిగిన రెండు చిత్రాల నిర్మాతలు కాంప్రమైజ్‌ అయినట్టుగా తెలుస్తోంది. రెండు చిత్రాల రిలీజ్‌ డేట్‌ విషయంలో చర్చలు జరిపిన దిల్‌ రాజు, అల్లు అరవింద్‌లు రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌లు మార్చేందుకు నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్టుగా జనవరి 12న కాకుండా సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న, అల వైకుంఠపురములో సినిమాను జనవరి 13న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. Also Read: దీంతో రెండు చిత్రాల మధ్య ఒక రోజు గ్యాప్‌ ఉండటంతో కొంత వరకు థియేరట్ల సమస్య తీరటంతో పాటు ఓపెనింగ్ కలెక్షన్లు విషయంలో కూడా పెద్ద ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. మహర్షి లాంటి బిగ్ హిట్ తరువాత మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తు్న్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సోల్జర్‌గా నటించనున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి ఎలాగైన తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు బన్నీ. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NoCkoN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...