Monday, 4 November 2019

ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్స్‌.. రకుల్‌ జోరు మామూలుగా లేదు!

టాలీవుడ్‌లో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌. తెలుగు అగ్రకథానాయకులందరి సరసన నటించిన ఈ బ్యూటీ ఇటీవల కాస్త వెనుకపడింది. వరుస ఫెయిల్యూర్స్‌ రావటంతో రకుల్‌కు అవకాశాలు కూడా తగ్గాయి. అదే సమయంలో ఈ భామ బాలీవుడ్ మీద దృష్టి పెట్టడంతో సౌత్‌ దర్శక నిర్మాతలు అమ్మడిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇన్నాళ్లు నార్త్‌లో కూడా రకుల్‌ ఆశించిన స్థాయి ఫలితాలు దక్కలేదు. అజయ్‌ దేవగన్‌ సరసన నటించిన హిట్ అయిన ఆ క్రెడిట్‌ రకుల్ ఖాతాలోకి రాలేదు. దీంతో అమ్మడికి భారీగా అవకాశాలేమీ క్యూ కట్టలేదు. తాజాగా ఈ భామ మర్జావన్‌ సినిమా పనుల్లో బిజీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. Also Read: అయితే తాజాగా ఈ భామ వరుస సినిమాలు అంగీకరిస్తున్న తిరిగి కెరీర్‌ పరంగా బిజీ అయ్యే ఆలోచనలో ఉందట. అందుకే వరుసగా సినిమాలు సైన్‌ చేస్తూ తిరిగి ఫాంలోకి రావాలని ఆశిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్న రకుల్‌, ఒకేసారి నాలుగు కొత్త ప్రాజెక్ట్స్‌ ఎనౌన్స్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వీటిలో బాలీవుడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయిట. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఈ నెలాఖరున ప్రకటించేందుకు రెడీ అవుతోంది రకుల్‌. ఇవి కాక ఇప్పటికే రెండు మూడు సినిమాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది రకుల్. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: ఈ సినిమాతో పాటు కోలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్‌ ఏలేటి తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌ సింగ్ పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరి ఇన్ని సినిమాలతో సిద్ధమవుతున్న రకుల్ అనుకున్నట్టుగా తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CehWR4
v

No comments:

Post a Comment