Friday, 22 November 2019

అతి పెద్ద స్కాంలో మంచు విష్ణు.. `మోసగాళ్లు` ఎవరు?

స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన మంచు విష్ణు స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయాడు. కామెడీ సినిమాలతో ఒకటిరెండు హిట్‌లు సాధించిన కెరీర్‌ను టర్న్‌ చేసే స్థాయి సూపర్‌ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యా్‌ప్‌ తీసుకున్నాడు మంచు విష్ణు. కొంత కాలంగా బిజినెస్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ యంగ్‌ హీరో త్వరలో ఓ క్రాస్‌ ఓవర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసిన చిత్రయూనిట్‌ త్వరలో విదేశాల్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టితో పాటు రుహానీ సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మంచు విష్ణు ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కాం చేసిన స్కామర్‌ అర్జున్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OgDJyt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...