ప్రముఖ నటి ఇటీవల ‘నో ఫిల్టర్ నేహా’ అనే ఛాట్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌పై కామెంట్స్ చేసేవారికి కెరీర్ ఉండదనేది కొందరి అభిప్రాయం. అలాంటిది తాప్సి.. ఏకంగా ఓ స్టార్ హీరో కొడుకుపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఇండస్ట్రీలో స్టార్ కిడ్ కాకపోయి ఉంటే ఏ హీరోకి అసలు కెరీర్ ఉండేది కాదు’ అన్న ప్రశ్నకు తాప్సి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘హర్షవర్ధన్ కపూర్. ఇతను కేవలం స్టార్ కిడ్ కాబట్టే ఒక సినిమా ఫ్లాపైనా మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు హర్షవర్ధన్ కపూర్ విషయంలో నేను గమనించింది ఏంటంటే.. అతని తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ రెండో సినిమాలో అవకాశం వచ్చింది. ఎందుకంటే అతను అనిల్ కపూర్ కొడుకు కాబట్టి. ఒకవేళ నేను అతని స్థానంలో ఉండి ఉంటే నాకు అసలు కెరీరే ఉండేది కాదు’ అన్నారు. హర్షవర్ధన్ కపూర్ ఎవరో కాదు.. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమారుడు. అతను అనిల్ కపూర్ కొడుకు కాకపోయి ఉంటే అసలు ఇండస్ట్రీలో కెరీరే ఉండేది కాదని తాప్సి అన్నారు. అయితే ఈ విషయం తెలిసినా అనిల్, హర్షవర్ధన్ పాజిటివ్‌గానే స్పందిస్తారేమో కానీ అనిల్ కూతురు, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మాత్రం అస్సలు ఊరుకోదు. ఆమె తన కుటుంబం గురించి ఎవరైనా తక్కువ చేసినట్లుగా మాట్లాడితే అస్సలు భరించలేదు. తాప్సి చేసిన కామెంట్స్ ఆమె ఇప్పటివరకు చూడలేదు కాబట్టి సోనమ్ మౌనంగా ఉంది. ఒకవేళ తెలిస్తే మాత్రం కచ్చితంగా తన సమాధానంతో తాప్సి నోరుమూయిస్తుంది. అనంతరం తాప్సి తన ప్రియుడు మాథిస్ బో గురించి మాట్లాడుతూ.. ‘తన గురించి నేను ఏం మాట్లాడినా మీడియా ఎక్కువగా రాసేస్తుంది. అందుకే మౌనంగా ఉండాలనుకుంటున్నా. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా బీచ్ వెడ్డింగే చేసుకుంటా’ అని వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35nrKEY
v
No comments:
Post a Comment