Sunday, 3 November 2019

‘ఏమ్మా ప్రియాంకా నీ సిగరెట్లు ఎక్కడ?’

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఊపిరి పీల్చుకోకపోతే చనిపోతాం. కానీ దిల్లీ కాలుష్యానికి అక్కడున్నవారు ఊపిరి పీల్చుకుంటే చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. షూటింగ్స్ కోసం వెళుతున్న సెలబ్రిటీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ తన తర్వాతి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం దిల్లీ వెళ్లింది. అక్కడి కాలుష్యం భరించలేక ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ వేసుకుని సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ కోసం దిల్లీ వచ్చాను. ఇక్కడ షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్, మాస్క్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇళ్లు లేనివారిని ఆ దేవుడే కాపాడాలి’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ముందుగా ఊహించినట్లుగానే ప్రియాంక పోస్ట్‌‌పై ట్రోలింగ్ మొదలైంది. ఎందుకంటే ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని ఆమె ఓ సందర్భంలో చెప్పింది. అయితే బీచ్‌లో తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి సిగరెట్ తాగుతూ కనిపించింది. దాంతో ‘ఇప్పుడు ఈ ఆస్తమా డ్రామా ఏమైంది?’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. ఇప్పుడేమో దిల్లీలో కాలుష్యం ఉందంటూ ఫొటో పెట్టడంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ‘ఏమ్మా ప్రియాంకా కాలుష్యం తట్టుకోలేకపోతున్నావా? ఇప్పుడు నీ సిగరెట్లు ఏమయ్యాయ్?. కాలుష్యం భరించలేకపోతే అమెరికాకు వెళ్లిపో’ అంటూ కొందరు నెటిజన్లు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక కథానాయికగా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఆమె ‘ది వైట్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్‌రావు హీరోగా నటిస్తున్నాడు. ఓ చిన్న గ్రామంలో టీ షాప్ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత పెద్ద నగరంలో సక్సె‌స్‌ఫుల్ వ్యాపారవేత్తగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JNqfaR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...