ప్రముఖ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారట. ఓ దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరును వివరిస్తూ అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇటీవల హాలీవుడ్ నటులు స్కార్లెట్ జొహాన్సన్, రెనీ జెల్‌వెగర్, లుపీటా న్యోంగ్, లౌరా డెర్న్‌లతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన షాకింగ్ సంఘటన గురించి బయటపెట్టారు. ‘ఓ డైరెక్టర్ నన్ను షర్ట్ విప్పమన్నాడు. నా వక్షోజాలు చూస్తానన్నాడు. అదేంటి ఇదేం సినిమా సెట్ కాదు కదా అనుకున్నాను. కుదరదు అని చెప్పేశాను. నాకు నేనే సపోర్ట్‌గా నిలిచాను. కానీ కాస్త భయం కూడా వేసింది. నాతో పాటు ఆ రూంలో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉంది. ఆ డైరెక్టర్ నాతో అసహ్యంగా ఏం మాట్లాడాడో అవన్నీ వింటూనే ఉంది. కావాలంటే సెట్‌లో నా వక్షోజాలు చూపిస్తాను కానీ ఇలాంటి ప్రదేశాల్లో కాదని చెప్పాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నగ్న సన్నివేశాల్లో నటించాల్సి ఉంది’ ‘దాంతో నా రొమ్ములు చూస్తానని అన్నాడు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ నాకు సారీ కూడా చెప్పాడు. ఆ సమయంలో అతను అడిగాడు కదా అని నా షర్ట్ విప్పి చూపించి ఉంటే.. వారు ఏమైనా చేయగలరన్న దీమ వారిలో ఎక్కువైపోతుంది. కానీ నేను ధైర్యం చేసి నో చెప్పాను కాబట్టి అతను వెనక్కి తగ్గి నాకు సారీ చెప్పాడు. ఎప్పుడైతే గదిలో నుంచి ఆ డైరెక్టర్ బయటికి వెళ్లిపోయాడో అక్కడే ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ నా వద్దకు వచ్చి సారీ అలా జరిగి ఉండాల్సింది కాదు అంది’ అని తెలిపారు .
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OzZXKr
v
No comments:
Post a Comment