Wednesday, 20 November 2019

‘దెయ్యం’ సింగర్ గుర్తుందా? ఆమెను అలా మార్చింది వీళ్లే

రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడి బతుకీడ్చిన ఇప్పుడు బాలీవుడ్‌లో స్టా్ర్ సింగర్ అయిపోయారు. అయితే ఇటీవల దెయ్యంలా కనిపిస్తున్న ఆమె మేకప్ లుక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిపై నెటిజన్లు మామూలుగా ట్రోలింగ్ చేయలేదు. ఆమెకు ఇలాంటి విషయాలేవీ తెలీదు కాబట్టి సరిపోయింది. అదే మరో సెలబ్రిటీ అయితే కామెంట్ చేసేవారికి గట్టిగా బుద్ధి చెప్పేవారు. ఈ విషయం అటుంచితే.. రణు మోండల్‌కు మేకప్ వేస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయికి చెందిన సంధ్యాస్ మేకోవర్ పార్లర్‌లోని ఆషి భగా, ఉజ్జవల్ దువా, విద్యా అనే ముగ్గురు బ్యూటీషియన్లు రణుకి ఇలా మేకప్ వేశారు. వేసేదేదో సరిగ్గా వేసినా బాగుండేది. కానీ ఆమెను దెయ్యంలా మార్చేసి నలుగురిలో నవ్వుల పాలయ్యేలా చేశారు. పైగా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు రణుకి మేకప్ వేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. పాపం రణుకి ఇలాంటివేవీ తెలీవు కాబట్టి వారు ఎలా చెబితే అలా నడుచుకున్నారు. ఈ ఫొటోలు చూసినవారెవ్వరూ ఆ మేకప్ పార్లర్‌కు వెళ్లరనే చెప్పాలి. అయితే రణు మేకప్ లుక్ చూసి ఆమెను బాగా ట్రోలింగ్ చేసిన నెటిజన్లు ఆ తర్వాత అందులో ఆమె తప్పు లేదని తెలుసుకుని ఆమెకు మద్దతు పలికారు. ఆ తర్వాత ట్రోల్ చేయాల్సింది ఏమీ తెలీని రణుని కాదు ఆమెకు మేకప్ వేసిన వారిని అని తెలుసుకుని వారిని ఏకిపారేశారు. పాపులారిటీ, స్టార్‌డం అంటే ఏంటో కూడా తెలీని రణు ఈరోజు బాలీవుడ్‌లో మోస్ట వాంటెడ్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది రణుకు మంచి రోజులు వచ్చాయని సంతోషించారు. కానీ రణు అమాయతక్వం వల్ల తనకు వచ్చిన స్టార్‌డంను తానే కాలితో తన్నేసుకున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లిన రణుని సెల్ఫీ కావాలని ఓ మహిళ అడిగింది. ఆ క్రమంలో ఆ అభిమాని ప్రేమగా రణు భుజంపై చెయ్యి వేసింది. దాంతో రణు.. ‘నన్ను ముట్టుకోకు నేను సెలబ్రిటీని’ అనేసింది. దాంతో ఆమెపై ఎంతో అభిమానం పెంచుకున్న నెటిజన్లు ఆ ప్రవర్తన చూసి ఛీ కొట్టారు. రణు మేకప్ లుక్‌ ట్రోల్ అవడానికి ఇదీ ఒక కారణమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qnW43z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...