Saturday, 2 November 2019

మనసు చంపుకుని ఆ పాడు పని చేయాల్సి వచ్చింది: షారుక్

కింగ్ ఆఫ్ బాలీవుడ్, బాద్‌షా ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో స్టార్‌డంను కొనసాగిస్తున్న షారుక్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ షాకింగ్, ఫన్నీగా ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘ఓసారి నేను కారులో ఓ ప్రదేశానికి వెళుతున్నాను. ఆ ప్రదేశం ఏంటో నేను చెప్పను. ఎందుకంటే అక్కడ నేను ఓ ఖరీదైన దొంగతనం చేశాను. అన్ని వివరాలు బయటపెడితే నన్ను పట్టుకుంటారు. కారులో వెళుతున్నప్పుడు కారు టైర్ పంక్చరైంది. దాంతో ఏం చేయాలో తెలీలేదు. దగ్గర్లో ఓ కారు పార్క్ చేసి ఉంది. అది కూడా నాలాంటి కారే. ఎవ్వరూ లేరు కదా అని టైరు దొంగిలించాను’ ‘ఆ టైరుని కారుకి పెడుతుంటే రెండో టైర్‌ కూడా పంక్చరై ఉంది. ఇక చేసేదేంలేక అదే కారు నుంచి మరో టైర్‌ను దొంగిలించాను. నా కారుకు టైర్లు ఫిక్స్ చేసి పంక్చరైన నా టైర్లను ఆ కారుకి పెట్టేశాను. దాంతో చూసేవారికి కారు టైరు పంక్చర్ అవ్వడం వల్ల వదిలేసి వెళ్లిపోయారు అనుకుంటారని అనుకున్నాను. కానీ ఇలా చేయడం తప్పు అని తెలుసు. అందుకే ఓ పేపర్‌లో నా పరిస్థితిని వివరించి సారీ అని రాశాను. ఆ పేపర్‌ను కారులో పెట్టాను. ఇలాంటి పనులు నేను చచ్చినా చేయను. కానీ ఆ సమయంలో నాకు వేరే మార్గం కనపడలేదు. దాంతో మనసు చంపుకుని ఆ పాడు పని చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ అలాంటి తప్పులు చేయలేదు’ అని వెల్లడించారు షారుక్. షారుక్ బర్త్‌డే సందర్భంగా ఎందరో అభిమానులు ముంబయిలోని మన్నత్ (షారుక్ ఇంటి పేరు) వద్ద గుమిగూడారు. షారుక్ కోసం ఎన్నో గిఫ్ట్స్ తెచ్చారు. వారందరికీ థ్యాంక్స్ చెప్పడానికి షారుక్ ఇంటి బయటికి వచ్చి సందడి చేశారు. ఇక ఆయన వర్క్ విషయానికొస్తే.. ‘జీరో’ సినిమా ఫ్లాపవడంతో షారుక్ షాకయ్యారు. తేరుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. దాంతో కొంతకాలం విరామం తీసుకుని తన కుటుంబంతోనే గడిపారు. ఈరోజు ఆయన బర్త్‌డే కావడంతో తన కొత్త సినిమాలకు సంబంధించిన ఏదన్నా ప్రకటిస్తారేమో చూడాలి. మరో విషయం ఏంటంటే.. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, షారుక్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ‘సాంకీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NBw8sH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...