Saturday, 2 November 2019

పక్కన కొడుకుని పెట్టుకుని, ఎక్స్‌పోజ్ చేస్తూ పవన్ హీరోయిన్ సెల్ఫీ

బాలీవుడ్ డ్యాన్సర్ ఐటెం సాంగ్స్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ఆమె పెట్టే ఫొటోలకు అంత మంది హేటర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మలైకా వయసు 46. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఓ పిల్లాడికి తల్లి కూడా అయింది. కుమారుడు ఎదుగుతున్న వయసులో మలైకా తన భర్తతో విడిపోయి తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. కొందరు క్రిటిక్స్ ఆమెను హేట్ చేయడానికి ఇది ఒక కారణం. మరొకటేంటంటే.. నాలుగు పదుల వయసులో మలైకా ఎక్కువ ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫొటోలు దిగడం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. 20, 30 ఏళ్ల కథానాయకలు కూడా మలైకా చేస్తున్నంత ఎక్స్‌పోజింగ్ చేయరేమో అన్నంతగా ఆమె దుస్తులు ఉంటాయి. ఈ విషయం పక్కనబెడితే.. తాజాగా మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. తన కుమారుడితో కలిసి సెల్ఫీ దిగిన ఫొటో అది. దానికి క్యాప్షన్‌గా.. ‘కొడుకు ఒంట్లో బాలేని తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు..’ అని పేర్కొన్నారు. క్యాప్షన్ బాగానే ఉంది కానీ ఫొటో చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఫొటోలో మలైకా దుస్తులు సరిగ్గా లేవు. రొమ్ము భాగం కనిపించేలా నైటీ వేసుకుని కొడుకుతో కలిసి ఫొటో దిగడం కొందరు నెటిజన్లకు మింగుడు పడలేదు. కొడుకు చిన్న పిల్లాడు అయివుంటే అది వేరు. కానీ ఇప్పుడు అర్హాన్ వయసు పదహారేళ్లు. టీనేజ్ కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు కన్నతల్లి వేసుకోవాల్సిన దుస్తులేనా అవి అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మలైకా మాత్రం ఇలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. నా బాడీ నా ఇష్టం అంటూ ఇప్పటివరకు చాలా సార్లు ఘాటుగా స్పందించారు. ఇటీవల మలైకా తన 46వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అదే రోజున తాను అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నానని అతనితో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో మలైకా ‘కెవ్వు కేక’ అనే ఐటెం సాంగ్‌లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. మలైకా కేవలం ఐటెం సాంగ్స్‌లో మాత్రమే నటిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆమె జోరు కాస్త తగ్గింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JLAkoG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...