Monday, 18 November 2019

చొక్కా విప్పి హీరోయిన్‌ను టెంప్ట్ చేసిన నటుడు (వీడియో)

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 13లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వారికి స్వయంవరం అనే టాస్క్‌ను ఇచ్చాడు. బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్‌ ఈ షోలో పాల్గొన్నారు. ఆమెకు స్వయంవరం నిర్వహించాలని చెప్పారు. అయితే హౌజ్‌లో ఉన్న అబ్బాయిల్లో ఎవరైతే షెహనాజ్‌ను టెంప్ట్ చేస్తారో వారిని ఆమె పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను కలర్స్ టీవీ విడుదల చేసింది. వీడియోలో పరాస్ చాబ్రా అనే కంటెస్టెంట్ చొక్కా విప్పి షెహనాజ్ ముందు డ్యాన్స్ చేసి ఆమెను టెంప్ట్ చేశాడు. దాంతో షెహనాజ్ అతనికి ఫిదా అయిపోయారు. అంతేకాదు పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించేసుకున్నారు. పైగా పరాస్ తనకోసం చొక్కా విప్పడమే తనకు కావాలని షెహనాజ్ తెలిపారు. వారిద్దరూ కౌగిలింతలో బిజీగా ఉండటం చూసి పక్కనే ఉన్న ఇతర కంటెస్టెంట్లు తెల్ల మొహం వేశారు. ఈ షో మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల కోసం సపరేట్‌గా పడకలు ఏర్పాటుచేస్తారు. కానీ ఈ షోలో బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్ పేరుతో కొందరు మగ కంటెస్టెంట్లు ఆడ కంటెస్టెంట్లతో కలిసి నిద్రపోవడం రచ్చ పుట్టించింది. దాంతో బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని చాలా మంది నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చారు. కానీ సల్మాన్ ఖాన్ ఉండటంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కంటెస్టెంట్లకు ఆట ఎలా ఆడాలో తెలీడంలేదని ఓసారి సల్మాన్ ఖాన్ వారిపై కోపడ్డారు కూడా. నేను వెళ్లిపోతున్నాను, మీ ఇష్టమొచ్చినోళ్లతో చేయించుకోండి అంటూ షో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత షో నిర్వాహకులు ఆయనకు సారీ చెప్పి మళ్లీ రప్పించుకున్నారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ వస్తామంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కనీసం ఈ షో ద్వారా అయినా మళ్లీ తమకు సినిమా, సీరియల్స్‌లో అవకాశాలు రాకపోవా అన్న ఆశతో ఇచ్చిన టాస్క్‌లన్నీ పూర్తి చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37hP0FX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...