Wednesday, 6 November 2019

ఆ స్టేడియమే ఈ స్టార్ హీరోయిన్ ఇల్లు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లైఫ్ ఆధారంగా ఓ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. సైనా పాత్రలో బాలీవుడ్ నటి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పరిణీతి చాలా రోజులుగా కష్టపడుతున్నారు. సైనాలా సహజంగా కనిపించేందుకు బ్యాడ్మింటన్‌ను బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే సినిమాలో సీన్స్ అన్నీ రియలిస్టిక్‌గా ఉండటానికి పరిణీతి ఓ ఉపాయం ఆలోచించారు. ఇంటి నుంచి స్టేడియంకి వెళ్లి ప్రాక్టీస్ చేసే బదులు స్టేడియంకే తన మకాం మార్చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం నవీ ముంబైలోని రామ్‌సేథ్ ఠాకూర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో ఓ గదిని తీసుకున్నారు. దాదాపు 15 రోజుల వరకు అక్కడే ఉండబోతున్నారట. తన ఇంటి నుంచి స్టేడియంకు వెళ్లే టైంను బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయడానికి వాడాలనుకుంటున్నానని పరిణీతి తెలిపింది. ‘నేను ప్లాన్ ప్రకారమే నా మకాంను కొన్ని రోజుల పాటు స్టేడియంకు మార్చుకోవాలని అనుకున్నాను. బ్యాడ్మింటన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇంకాస్త ఎక్స్‌ట్రా టైం కేటాయించాలని అనుకుంటున్నాను. ఈ బయోపిక్‌లో నన్ను చూసిన వారంతా నిజంగానే సైనా అనుకోవాలి. అంతా రియలిస్టిక్‌గా ఉండాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అంతేకాదు స్టేడియంలో ఉన్నంతవరకు నేను ఎవ్వరితోనూ మాట్లాడదలచుకోలేదు. నా టైం అంతా ఈ గేమ్‌పైనే ఉండాలి. స్టేడియంలో నాకు మంచి రూంను కేటాయించిన డైరెక్ట

ఈ బయోపిక్‌ను అమోల్ గుప్తే డైరెక్ట్ చేస్తారు. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది. అసలైతే ఈ బయోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించాలి. ఇందుకోసం శ్రద్ధ సైనా పేరెంట్స్‌ని కూడా కలిశారు. అంతా ఓకే అనుకుంటున్న టైంలో శ్రద్ధకు ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధకు గతంలో ‘ఏబీసీడీ 2’ సినిమాలో నటించే అవకాశం రెమో ఇచ్చారు. ఆయనకు నో చెప్పలేక శ్రద్ధ సైనా నెహ్వాల్ బయోపిక్‌ను పక్కన పడేసింది. దాంతో ఆ అవకాశం పరిణీతికి దక్కింది. 2020లో సైనా బయోపిక్ రిలీజ్ అవ్వబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34yUEl2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...