Sunday, 10 November 2019

రామ్ చరణ్ చేతుల మీదుగా మహేష్ మేనల్లుడి సినిమా ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా రూపొందనున్న తొలి సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. హీరోహీరోయిన్లు అశోక్, నిధి అగర్వాల్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్‌నిచ్చారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అశోక్ తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు. సందడిగా జరిగిన ఈ కార్యక్రయంలో గల్లా కుటుంబ సభ్యులు రామచంద్రనాయుడు, అరుణ కుమారి, జయదేవ్, పద్మావతితో పాటు నటుడు వీకే నరేశ్‌, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. అంతేకాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేష్ బాబు అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ruSLYq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...