Monday, 18 November 2019

Bigg Boss మాజీ కంటెస్టెంట్ల అరాచకం.. ముద్దులతో రచ్చపుట్టిస్తున్నారు

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బానీ, సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సప్నా భవ్నానీ లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘నువ్వే నా సన్‌షైన్’ అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను సప్నా ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తోంది. సప్నా స్వలింగ సంపర్కురాలు. బానీ బుల్లితెర నటుడు యువరాజ్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ విడిపోవడంతో బానీ.. సప్నా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై సప్నా స్పందిస్తూ.. ‘నేను బాని కిస్ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది బూమరాంగ్ వీడియో. కేవలం ఒక ముద్దు గురించి ఇంత రచ్చ చేయాలా? ఎవరైతే శాంతి కోసం పోరాడుతున్నారో వారి గురించి మాత్రం ఏ వార్తా ట్రెండ్ అవ్వదు. కానీ ఒక ముద్దు వీడియో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. ఇండియా ఇంకెప్పుడు ముందుకెళుతుంది’ అని ప్రశ్నించింది. అయితే సప్నా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో షాకింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. సప్నా కుర్చీలో కూర్చుని ఉండగా ఓ యువతి నిలబడి ఆమెను హత్తుకుంది. ఆ నిలబడి ఉన్న యువతి నటి బానీనే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోకు సప్నా కామెంట్ చేస్తూ.. ‘స్వేచ్ఛ, ప్రేమ రెండూ ఒకటే. ప్రేమ అనేది రియాక్షన్ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నంత మాత్రాన నేను నిన్ను ప్రేమిస్తే అది బిజినెస్ అవుతుంది. ప్రేమ అవ్వదు. ప్రేమను పంచడం అంటే ఒకరి నుంచి దానిని ఆశించకూడదు. అలాంటి ప్రేమకే తెలుస్తుంది అసలైన స్వేచ్ఛ‌కు అర్థమేంటో’ అని పేర్కొంది. ఏదేమైనా ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. బానీ, సప్నా సమాజంలో ఆడవాళ్లపై, స్వలింగ సంపర్కులపై ఎప్పుడూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NZ0I0J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...