Friday, 25 October 2019

బన్నీ అన్న Tarak అన్న అయితే ఇరగదీసుండేవారు: విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయన ఎంచుకునే కథల నుంచి చేసే ప్రమోషన్స్ వరకు అన్నీ వెరైటీగా ప్రేక్షకులను ఆకట్టుకుండేలా ఉండేలా చూసుకుంటాడు. అందుకే విజయ్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా ఎంతో క్రేజ్ ఉంది. నటుడిగా తానేంటో నిరూపించుకున్న విజయ్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకు సంబంధించిన ‘నువ్వే హీరో’ అనే ప్రమోషనల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌కు సంబంధించిన విజయ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఈ వీడియో మొత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో షూట్ చేశారు. విజయ్ వేసుకున్న దుస్తులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ వీడియో కోసం విజయ్‌కు డ్యాన్స్ సరిగ్గా రావాలని కొరియోగ్రాఫర్ చాలా కష్టపడ్డాడట. ఇంతటి కష్టమైన స్టెప్పులు తన వల్ల కావని, తారక్ అల్లు అర్జున్ అయితే ఇరగదీసుండేవారని చెప్పాడు. తాను మాత్రం ఈ వీడియోలో డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు అభినవ్ గోమతం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షమీర్ సుల్తాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు విజయ్ ‘హీరో’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరో సినిమా ఆగిపోయిందనుకున్నారు కానీ ఇటీవల మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. రౌడీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, కేథరీన్, ఇజబెల్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి విజయ్ ‘బాక్సర్’ అనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MN4ARJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...